: మేడారం జాతరకు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం
వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన మేడారం జాతరకు సంబంధించిన హుండీ లెక్కింపు పూర్తయిందని ఈవో ప్రకటించారు. రికార్డు స్థాయిలో ఈసారి హుండీ ఆదాయం లభించింది. హుండీ ఆదాయం మొత్తం 6 కోట్ల 44 లక్షల రూపాయలు వచ్చింది. నగదుతో పాటు, 900 గ్రాముల బంగారం, 41 కిలోల వెండి వచ్చిందని ఈవో తెలిపారు. ఈ హుండీ లెక్కింపు ప్రక్రియ వారం రోజులు జరిగిన విషయం తెలిసిందే.