: పంజాబ్ లో రూ.50 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం


పంజాబ్ లోని అమృత్ సర్ వద్ద ఈ తెల్లవారుజామున సరిహద్దు భద్రతా దళాలు రూ.50 కోట్ల విలువైన హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నాయి. సరిహద్దు గ్రామం రజతాల్ వద్ద పాకిస్తాన్ నుంచి స్మగ్లర్లు భారత్ లోకి ప్రవేశించేందుకు యత్నిస్తుండగా, బీఎస్ఎఫ్ బలగాలు లొంగిపోవాలని వారిని హెచ్చరించాయి. కానీ, వారు కాల్పులకు దిగడంతో బీఎస్ఎఫ్ సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. దీంతో, వారు పారిపోయారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా పది కేజీల హెరాయిన్ లభ్యమైంది. మొత్తం పది ప్యాకెట్లలో ఉన్న ఈ మాదకద్రవ్యం విలువ మార్కెట్లో యాభై కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News