: ఎన్సీపీ ఒక మునిగిపోతున్న ఓడ: ఉద్ధవ్ థాకరే
శరద్ పవార్ పార్టీ ఎన్సీపీపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఒక మునిగిపోతున్న ఓడ అని, పవార్ నేతృత్వంలోని పార్టీలో అందరూ అత్యాశ కలిగిన సైనికులే ఉన్నారని విమర్శించారు. ఈ మేరకు ముంబయిలోని డొంబివిల్లీలో ర్యాలీలో పాల్గొన్న ఉద్ధవ్ ప్రసంగిస్తూ, కాంగ్రెస్, ఎన్సీపీ వైఫల్యాలను తీవ్రంగా ఎండగట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు విశ్వసనీయత కలిగిన ఒక కూటమిని ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.