: న్యూయార్క్ లో 'అవతార్' హీరో అరెస్ట్
'అవతార్' సినిమాలో జేక్ సల్లీగా సుపరిచితుడైన హాలీవుడ్ హీరో శామ్ వర్థింగ్టన్ ను న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఫొటోగ్రాఫర్ ను కొట్టాడని ఈ ఆస్ట్రేలియా జాతీయుడిని అదుపులోకి తీసుకున్నారు. తన ప్రేయసి లారా బింగిల్ ను ఆ ఫొటోగ్రాఫర్ అభ్యంతరకర రీతిలో తాకడంతో శామ్ ఆగ్రహంతో అతనిపైకి ఉరికి, ముఖంపై గుద్దాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న న్యూయార్క్ పోలీసులు ఈ హీరోను అరెస్ట్ చేసి ఆనక వదిలేశారు. రేపు కోర్టులో హాజరుకావాలని ఆదేశించారు. కాగా, శామ్ ప్రియురాలు లారా బింగిల్ ప్రముఖ మోడల్. ఆస్ట్రేలియాకే చెందిన ఈ ముద్దుగుమ్మ... ఆసీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ తోనూ ప్రేమాయణం నడిపింది.