: క్యాన్సర్ విజేతల కోసం మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్


ప్రమాదకర వ్యాధి క్యాన్సర్ నుంచి కోలుకుని జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నవారి కోసం ఓ ప్రత్యేక వైబ్ సైట్ రూపొందించింది కేరళ యువత. సెయింట్ జార్జ్ ఆర్థడాక్స్ యూత్ మూవ్ మెంట్ సభ్యులు ఈ సరికొత్త మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ కు రూపకల్పన చేశారు. దీని పేరు ఇన్ సైట్ మ్యాట్రిమోనీ.కామ్. ప్రాణాంతక క్యాన్సర్ ను జయించిన అవివాహితులు ఈ పెళ్ళి సంబంధాల వేదికలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. తద్వారా తమలాగే క్యాన్సర్ పోరాటం చేసిన వ్యక్తులను జీవిత సహచరులుగా పొందే అవకాశం లభిస్తుంది. మార్చి 7న ఈ వెబ్ సైట్ ను లాంచ్ చేస్తున్నారు. దీని వెబ్ అడ్రెస్... www.insightmatrimony.com.

ఈ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ చాకో థామస్ మాట్లాడుతూ, సమాజంలో క్యాన్సర్ పేషంట్లంటే దూరం పెడతారని, వారు మామూలు స్థితికి వచ్చినా ఇదే పరిస్థితి నెలకొని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తులకు వైవాహిక జీవిత మాధుర్యం అందించాలనే తమ ఆశయం అని చాకో వివరించారు.

  • Loading...

More Telugu News