: చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 262 పరుగులకు ఆసీస్ ఆలౌట్
ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారత్ - ఆసీస్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతోన్న 4వ, చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్ 262 పరుగుల వద్ద ముగించింది. తొలి ఇన్నింగ్స్ లో మొత్తంగా 112.1 ఓవర్లు ఆస్ట్రేలియా ఆటగాళ్లు బ్యాటింగ్ చేశారు. పిఎం సిడిల్ చేసిన 51 పరుగులే ఆసీస్ ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు కావడం విశేషం. భారత బౌలర్ అశ్విన్ కు ఏకంగా 5 వికెట్లు దక్కటం విశేషం.
కాగా, రెండో రోజైన ఇవాళ 8వికెట్లకు 231 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ వద్ద ఆసీస్ ఈ ఉదయం ఆట ప్రారంభించింది. కేవలం మరో 31 పరుగులు మాత్రమే జమచేసి తన తొలిఇన్నింగ్స్ ముగించింది. పాటిసన్ ను ఔట్ చేయడం ద్వారా భారత బౌలర్ ఓజా టెస్టుల్లో వంద వికెట్లు పూర్తి చేశాడు.
- Loading...
More Telugu News
- Loading...