: ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్రాన్ని విభజించారు: చంద్రబాబు


హైదరాబాదు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ కుటుంబ సమేతంగా వెళ్లి సోనియాను కలిశారని, తెలంగాణ కోసం ఉద్యమించిన వారిని పక్కకు నెట్టి, కుటుంబ సభ్యులకే కేసీఆర్ ప్రాధాన్యమిచ్చారని బాబు విమర్శించారు.

తెలంగాణ ప్రాంతంలోని వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాయని తెలిపారు. తెలుగువారి మధ్య చిచ్చు పెట్టేందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టారని ఆయన విమర్శించారు. రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ విభజనకు పూనుకుందని, వారికి ఓట్లు, సీట్లు ముఖ్యమయ్యాయని ఆయన విమర్శించారు. హైదరాబాదులో వసూళ్లు చేసిన కేసీఆర్, నగరాభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News