: హైదరాబాదులో పేదలకు రూ.5కే భోజనం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సర్వసభ్య సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి 4,599 కోట్ల రూపాయల బడ్జెట్ ను నగర మేయర్ మాజిద్ హుస్సేన్ ప్రవేశపెట్టారు. నగరంలోని నిరుపేదలకు ఐదు రూపాయలకే భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మాజిద్ హుస్సేన్ తెలిపారు.