: 2029 నాటికి రోబోలు మానవులను మించిపోతాయ్: గూగుల్
రజనీకాంత్ రోబో సినిమా చూశారా? 'చిట్టి' ఐశ్వర్యరాయ్ కోసం రజనీతోనే తలపడతాడు. అచ్చంగా అలా మానవులకు పోటీనిచ్చే స్థాయికి రోబోలు ఎదగనున్నాయి. 2029 నాటికి రోబోలు మానవుల భాషను అర్థం చేసుకోవడం, మానవుల కంటే తెలివిగా వ్యవహరించడం చేయగలవని గూగుల్ ఇంజనీరింగ్ విభాగం డైరెక్టర్ రే కుర్జ్ వీల్ అంటున్నారు. ఈయన టెక్నాలజీలో విశేష ప్రతిభ గల వ్యక్తి. గతంలోనూ ఈయన వేసిన పలు అంచనాలు కరెక్టయ్యాయి. ప్రపంచాన్ని ఇంటర్నెట్ ఒక్కటి చేస్తుందని కుర్జ్ వీల్ మొదట్లోనే చెప్పారు.