: పాయకారావుపేటలో బాలకృష్ణ పర్యటన


సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ నేడు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు విశాఖ నుంచి తుని మండలంలోని తలుపులమ్మలోవ చేరుకుని అక్కడి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం మిత్రుడు చల్లకొండ రమేష్ నివాసానికి వెళ్లి, కొంతసేపటి తర్వాత విశాఖ జిల్లా పాయకారావుపేట మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. చివరిగా కుమారపురంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ పర్యటనల కోసం బాలయ్య నిన్ననే విశాఖకు చేరుకున్న సంగతి తెలిసిందే.  

  • Loading...

More Telugu News