: తెలంగాణ సీఎం సీటు కోసం కేసీఆర్ పావులు?


తెలంగాణ రాష్ట్ర ఆశయాన్ని సాధించుకున్న గులాబీ దళపతి కేసీఆర్.. ఇప్పుడు కొత్తగా ఏర్పడనున్న తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి కావాలని అభిలషిస్తున్నారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధినేత్రికి తన మనసులోని మాట చెప్పినట్లు తెలుస్తోంది. నిన్న ఢిల్లీలో సోనియా, దిగ్విజయ్ సింగ్ తో కేసీఆర్ సమావేశమైన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కేసీఆర్ ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు తన మాటను వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఉండడంతో విలీనం ద్వారా తగిన ప్రయోజనం పొందాలనేది ఆయన చర్చల సారాంశంగా తెలుస్తోంది.

ఒకవేళ విలీనం చేయకపోతే కేసీఆర్ కు సీఎం సీటు, కాంగ్రెస్ కు ఎక్కువ ఎంపీ స్థానాలు ఇచ్చేలా రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలియవచ్చింది. తద్వారా ఇటు గులాబీ దళపతి కోరిక, అటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు వీలుంటుందనే వాదన ఉంది. అయితే, విలీనం చేస్తే ముందు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసి (టీసీసీ) దానికి చీఫ్ గా కేసీఆర్ ను నియమించవచ్చనే సమాచారం వినిపిస్తోంది. మేడమ్ తో కేసీఆర్ చర్చల ఫలితం రానున్న రోజుల్లో స్పష్టంగా వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News