: అంబరీష్ కోలుకుంటున్నారు: భార్య సుమలత


శాండల్ వుడ్ నటుడు, ఎమ్మెల్యే అంబరీష్ ఆరోగ్యంగానే ఉన్నారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆయన భార్య సుమలత తెలిపారు. ఆయన ఆరోగ్యం విషమించిందని వస్తున్న వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం శ్వాసకోశ సమస్యకు అంబరీష్ చికిత్స పొందుతున్నారని, బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రి వైద్యులు చికిత్స చేస్తున్నట్లు మీడియాకు వివరించారు. ఈ మేరకు త్వరలోనే అంబరీష్ ను జనరల్ వార్డుకు మారుస్తామని వైద్యులు చెప్పారని వెల్లడించారు. ఐసీయూలో వెంటిలేటర్ తో ఉన్నందున మాట్లాడటానికి వీలుకావడం లేదని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుమలత తెలిపారు. మరోవైపు అంబరీష్ ను హెచ్ డీ దేవెగౌడ, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప, కన్నడ నటుడు దర్శన్, మోహన్ బాబు, ఆయన కుమారుడు విష్ణు పరామర్శించారు. రెండు రోజుల కిందట తీవ్ర అస్వస్థత కారణంగా అంబరీష్ ఆసుపత్రిలో చేరారు.

  • Loading...

More Telugu News