: శామ్ సంగ్ సరికొత్త స్మార్ట్ వాచ్ తో గుండెకు రక్షణ


చేతికి ధరించే సరికొత్త స్మార్ట్ వాచ్ గేర్-2 ను శామ్ సంగ్ ఆవిష్కరించింది. శామ్ సంగ్ గతేడాది తొలి స్మార్ట్ వాచ్ ను ఆవిష్కరించగా దానికి మరికొన్ని అదనపు హంగులు, సౌకర్యాలతో ఆధునికీకరించి తాజాగా రెండు వెర్షన్లను విడుదల చేసింది. గేర్-2లో ఉన్న ప్రధాన ఆకర్షణ హార్ట్ రేట్ మానిటర్. గుండె స్పందనలను పరీక్షిస్తూ ఎప్పటికప్పుడు మనకు తెలియజేసే ఫీచర్ ఇందులో ఉంది. పైగా ఈ వాచ్ మరింత పల్చగా, తక్కువ బరువు ఉండడం అదనపు ఆకర్షణ.

ఇందులో గూగుల్ ఆండ్రాయిడ్ కు బదులుగా శామ్ సంగ్ తన సొంత టింజెన్ అనే ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించింది. బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ద్వారా హాయిగా సంగీతం వినవచ్చు. అలాగే కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇక 1.6 అంగుళాల స్క్రీన్, 2 మెగాపిక్సెల్ కెమెరా, పెడోమీటర్, సంక్షిప్త సందేశాలు, మెయిల్స్ వచ్చినప్పుడు అలర్ట్ సిస్టం ఇలా ఎన్నో సదుపాయాలు ఇందులో ఉన్నాయి. అలాగే, టీవీ తదితర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు రిమోట్ గా కూడా పనిచేయనుంది. ధరను ఇంకా ప్రకటించలేదు.

  • Loading...

More Telugu News