: తిరుపతిలో యాత్రికుల కోసం పుట్ ఓవర్ వంతెన, సబ్ వే ప్రారంభం


తిరుపతికి వచ్చే యాత్రికుల సౌకర్యార్ధం రైల్వే స్టేషన్ నుంచి విష్ణు నివాసం అతిధి గృహం వరకు నేరుగా పాదచారులకు ఉపయోగపడే విధంగా నిర్మించిన వంతెనను టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ఈ రోజు ప్రారంభించారు. దీంతో యాత్రికులకు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న రోడ్డు దాటే ఇబ్బంది తప్పింది. మరోవైపు బస్ స్టాండ్ నుంచి శ్రీనివాసం అతిధి గృహంలోకి నిర్మించిన అండర్ గ్రౌండ్ రహదారి (సబ్ వే)ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈవో గోపాల్, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News