: నోటిఫికేషన్ వచ్చేంతవరకు రెండు రాష్ట్రాలు ఏర్పడవు: 'సుప్రీం' న్యాయవాది
ఆంధ్రప్రదేశ్ విభజన వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయవాది పీపీ రావు స్పందించారు. విభజనపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసేంతరకు రెండు రాష్ట్రాలు ఏర్పడవని వెల్లడించారు. అప్పటి వరకు ఇద్దరు సీఎంలను నియమించడం సాధ్యపడదని స్పష్టం చేశారు. ఇక, ఎంపీలపై చర్యలు తీసుకునే విషయంలో పార్లమెంటుకే పూర్తి అధికారం ఉంటుందని చెప్పారు. కాగా, హోం మంత్రి షిండే ఇంతకుముందు మాట్లాడుతూ, మరో మూడు నెలల్లోగా విభజన ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యంకాదని చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరుగుతాయని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన ఎన్నికల తర్వాతే ఉండొచ్చని తెలుస్తోంది.