: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముకేశ్ అంబానీ చేతిలో కీలుబొమ్మలు: కేజ్రివాల్


ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్ కాంగ్రెస్, బీజేపీలపై తన విమర్శల దాడిని తీవ్రం చేశారు. నేడు హర్యానాలోని రోహ్ తక్ నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించిన ఆయన అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ముకేశ్ అంబానీ చేతిలో బీజేపీ, కాంగ్రెస్ కీలుబొమ్మలని విమర్శించారు. అంబానీ కోసం ఆ రెండు పార్టీలు జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టాయని దుయ్యబట్టారు. కాగా, బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి గ్యాస్ ధరలపై తాను రాసిన లేఖకు ఇంకా ఆయన నుంచి సమాధానం రాలేదని తెలిపారు. తనకు పదవులు ముఖ్యం కాదని, విలువల కోసమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని కేజ్రీవాల్ తెలిపారు.

  • Loading...

More Telugu News