: బుధవారం కిరణ్ కొత్త పార్టీ ప్రకటన...?
రాష్ట్ర విభజనపై రగిలిపోతున్న కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టేందుకే నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. బుధవారం కొత్త పార్టీ ప్రకటన ఉండొచ్చని కిరణ్ మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. నేడు ఇతర నేతలతో కిరణ్ భేటీ కాగా, అత్యధికులు కొత్త పార్టీకే మొగ్గు చూపినట్టు సమాచారం. పార్టీ పెట్టాల్సిందేనని కిరణ్ ను కలిసిన అనంతరం హర్షకుమార్ వ్యాఖ్యానించడం తెలిసిందే.