: కొత్త పార్టీ పెట్టాల్సిందే: హర్షకుమార్


ఈ మధ్యాహ్నం హైదరాబాదు మాదాపూర్ లో కిరణ్ కుమార్ రెడ్డితో పలువురు నేతలు భేటీ అయిన సంగతి తెలిసిందే. లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్, ఉండవల్లి, సాయి ప్రతాప్, సబ్బం హరి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పితాని, పార్థసారథి, శైలజానాథ్ తదితరులు కిరణ్ తో తాజా పరిణామాలపై చర్చించారు. భేటీ అనంతరం హర్షకుమార్ మాట్లాడుతూ, కొత్త పార్టీ పెట్టాలని కిరణ్ ను కోరామని చెప్పారు. సమైక్య పోరాటం వృథా కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. కిరణ్ నాయకత్వంలో కొత్త పార్టీ పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సమావేశం మాదాపూర్లోని కిరణ్ సోదరుడి కార్యాలయంలో జరిగింది.

  • Loading...

More Telugu News