: గాంధీభవన్లో కిరణ్ ఫొటో తొలగింపు.. ఆ స్థానంలో ఆజాద్ ఫొటో
రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీఎం పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కిరణ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కాగా, గాంధీభవన్లోని మీడియా హాల్ నుంచి ఆయన ఫొటోను ఈ ఉదయం తొలగించారు. ఆ ఫొటో స్థానంలో కేంద్ర ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ ఫొటోను అమర్చారు.