: క్రెడిట్ సోనియాదేనంటున్న మధుయాష్కీ
ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న టి కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రెడిట్ సోనియాదేనని ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఉద్ఘాటించారు. సోనియా దృఢ సంకల్పం వల్లే స్వప్నం సాకారమైందని వివరించారు. విభజన కారణంగా కాంగ్రెస్ నష్టపోనుందన్న వాదనను మధుయాష్కీ కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని నొక్కి చెప్పారు.