: మహిళా ఓటర్ల విషయంలో దిగువన ఢిల్లీ
దేశంలో అరక్షిత నగరంగా పేరొందిన ఢిల్లీలో మహిళా ఓటర్లు తక్కువ ఉన్నట్లు ఎన్నికల సంఘం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశం మొత్తం మీద 81.4కోట్ల ఓటర్లు ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లోకీ ఢిల్లీలోనే పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు తక్కువగా ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లు 44.57శాతం మందే ఉండగా.. దీని తర్వాత ఉత్తరప్రదేశ్ పరిస్థితీ అలానే ఉంది. పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్న రాష్ట్రాలలో కేరళ టాప్ లో ఉండగా, పుదుచ్చేరి తర్వాతి స్థానంలో నిలిచింది.