: ఘజియాబాద్ కుర్రాడికి గూగుల్ రూ.40లక్షల ఆఫర్
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ బీటెక్ కుర్రాడు జాక్ పాట్ కొట్టాడు. గూగుల్ లో భారీ వేతనంతో కూడిన కొలువును సొంతం చేసుకున్నాడు. అజయ్ కుమార్ గార్గ్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన బీటెక్ విద్యార్థి తుషార్ కు గూగుల్ 40 లక్షల రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగ అవకాశం కల్పించింది.