: వికారాబాద్ రాజీవ్ గృహకల్ప వద్ద పేలుడు.. ఇద్దరి దుర్మరణం
రంగారెడ్డి జిల్లా వికారాబాద్ వద్ద ఈ రోజు రాత్రి పేలుడు సంభవించింది. ఇక్కడి రాజీవ్ గృహకల్పలో పేలుడు జరగడంతో ఇద్దరు వ్యక్తులు మరణించినట్టు తెలుస్తోంది. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకున్నారు.