: విజయవాడ, గుంటూరు మధ్యే రాజధాని?


సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధానిని విజయవాడ, గుంటూరు మధ్యలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. మంగళగిరి సమీపంలోని నాగార్జున యూనివర్సిటీ ప్రాంతాన్ని ఇందుకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీని ఒంగోలు పీజీ సెంటర్ కు తరలించనున్నట్లు సమాచారం వెల్లడైంది. నాగార్జున వర్సిటీకి వందల ఎకరాల భూమి ఉండడం, ఆ చుట్టుపక్కల కూడా భూముల లభ్యత ఉండడం సానుకూలాంశం. సీమాంధ్ర రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్యలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కూడా వెల్లడించడం గమనార్హం.

  • Loading...

More Telugu News