: కొత్త పార్టీ ఏర్పాటుపై రెండు మూడు రోజుల్లో స్పష్టత
వచ్చే రెండు మూడు రోజుల్లో కొత్త పార్టీ ఏర్పాటుపై స్పష్టత వస్తుందని కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ సబ్బం హరి చెప్పారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కిరణ్ ఫోన్ చేసి ఆహ్వానించినందునే సమావేశానికి వచ్చానన్నారు. రాష్ట్ర విభజన అనంతరం పరిణామాలను అంచనా వేశాకే పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.