: ప్రమాదంలో కోదండరాం ఉద్యోగం..!
సడక్ బంద్ సందర్భంగా అరెస్టయిన తెలంగాణ ఐకాస కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం ఉద్యోగం ప్రమాదంలో పడింది! శనివారం సాయంత్రం లోపు బెయిల్ రాకపోతే ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన సస్పెన్షన్ కు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. కోదండరాంకు నేడు కోర్టు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. సడక్ బంద్ కేసులో అరెస్టయిన కోదండరాం మహబూబ్ నగర్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోదండరాం సికింద్రాబాద్ పీజీ కళాశాలలో రాజనీతి శాస్త్రం ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.