: శ్రీవారి మొక్కు తీర్చుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మన రాష్ట్రానికి చెందిన జస్టిస్ రమణ వారం క్రితం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. దీంతో స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు. జస్టిస్ రమణకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అంతకుముందు జస్టిస్ రమణ కుటుంబ సభ్యులతో కలిసి తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.