: పుట్టుకతోనే అధిక బరువుతో శిశువు రికార్డు
ఓ శిశువు అధిక బరువుతో రికార్డు సృష్టించింది. మణిపూర్ లోని తౌబాల్ జిల్లాలో 37 ఏళ్ల షేనుదేవి శుక్రవారం రాత్రి ఒక ఆడ శివువుకు జన్మనిచ్చింది. ఆ పసిపాప 5.9కేజీల బరువు ఉండడం విశేషం. సిజేరియన్ ద్వారా వైద్యులు శిశువును బయటకు తీశారు. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. గతంలో 2010లో గుజరాత్ లోని సూరత్ లో ఒక మహిళ 5.7కేజీల బరువున్న ఆడ శిశువుకు జన్మనివ్వగా.. అదే ఇప్పటి వరకు దేశంలోనే అత్యధిక బరువున్న శిశువుగా రికార్డులలో నమోదై ఉంది.