: మద్యం తాగి చిందేసిన కోతి
కోతి మామూలుగా ఉంటేనే దాని చేష్టలకు హద్దు ఉండదు. మరి కడుపులో కాస్త మద్యం చుక్క పడితే ఎలా ఉంటుంది? విజయనగరంలో నిన్న ఒక కోతి ఇలానే చుక్కేసింది. ఒక బ్రాందీ సీసాను ఎక్కడ నుంచి పట్టుకొచ్చిందో కానీ, దాని మూత తీసేందుకు కొద్దిసేపు తంటాలు పడింది. నోటితో, చేతితో కష్టపడింది. రాకపోయే సరికి మూత పగులగొట్టి గుటకలేసింది. కాసేపు చిందులేసి అక్కడే శుభ్రంగా నిద్రపోయింది. రామానాయుడు రోడ్డులో ఇది జరిగింది.