: కాజీపేట చేరుకున్న డబుల్ డెక్కర్ రైలు


రైల్వే బడ్జెట్లో మంత్రి మల్లికార్జున ఖర్గే మన రాష్ట్రానికి రెండు డబుల్ డెక్కర్ రైళ్లను ప్రకటించారు. ఒకటి కాచిగూడ నుంచి తిరుపతి వరకు.. మరొకటి కాచిగూడ నుంచి గుంటూరు వరకు సేవలు అందించనున్నాయి. ఈ నేపథ్యంలో అప్పుడే ఒక డబుల్ డెక్కర్ రైలు రాష్ట్రానికి చేరుకుంది. పంజాబ్ లోని కపుర్తలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుంచి డబుల్ డెక్కర్ రైలు వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్ కు చేరుకుంది. ఇక్కడి నుంచి ఈ రైలు హైదరాబాద్ కు వెళుతుంది. కొద్దిరోజుల్లోనే దీన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ రైలులో 14 బోగీలు ఉండగా.. అన్నీ ఏసీ కోచ్ లే. 1680 మంది ప్రయాణికులు కూర్చోడానికి వీలుగా సీట్లు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News