: లగడపాటికి పొన్నం సలహా
రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ సలహా ఇస్తున్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని లగడపాటి తీసుకున్న నిర్ణయం తొందరపాటు చర్య అని, పునరాలోచించుకుని మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని కోరారు. లగడపాటి సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకున్నారని పేర్కొన్నారు. పెప్పర్ స్ప్రే ఘటన దేశంలోనేగాక అంతర్జాతీయంగానూ అప్రదిష్ఠ తెచ్చిపెట్టిందని అన్నారు. ఇక కేసీఆర్... టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని పలుమార్లు చెప్పాడని, మాట నిలుపుకుంటారో, లేదో అన్న విషయం ఆయనకే వదిలేస్తున్నామని చెప్పారు. రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే విశ్వసనీయత అయితే.. మాటపై నిలబడే వారినే ప్రజలు విశ్వసిస్తారని పొన్నం అభిప్రాయపడ్డారు.