: తెలంగాణ అంశంపై హీరో శివాజీ వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో శివాజీ నేడు తిరుమలలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అంశంపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. రాష్ట్ర విభజన అంశంలో ఓడిపోయామన్న భావన ప్రతి తెలుగువాడిలోనూ ఉందని చెప్పారు. తెలుగు ప్రజలను ఓడించింది తెలంగాణ ప్రజలు కాదని, సోనియానే అందుకు కారణమని వివరించారు. రాష్ట్రాన్ని చీల్చిన ఘనత సోనియాదేనని ఎద్దేవా చేశారు. ఓ కళాకారుడిగా తనను అన్ని ప్రాంతాల ప్రజలు ఆదరించారని శివాజీ పేర్కొన్నాడు. ప్రాంతీయ భావం కాదని జాతీయ భావం కావాలని సూచించాడు.