: ఇంటిముఖం పట్టిన భారత కుర్రాళ్ళు
అండర్-19 వరల్డ్ కప్ లో యువ భారత్ ప్రస్థానం ముగిసింది. నేడు దుబాయ్ లో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత కుర్రాళ్ళు 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలయ్యారు. 222 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు మరో ఐదు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఆ జట్టులో డకెట్ 62, జో క్లార్క్ 42 రాణించారు. చివర్లో జోన్స్ (28 నాటౌట్), సాయర్ (10 నాటౌట్) జట్టును విజయపథంలో నడిపించారు.