: బెదిరించి మరీ, బంగారాన్ని దోచుకెళ్లారు
కత్తులతో బెదిరించి మరీ, ఆ దొంగలు బంగారాన్ని దోచుకెళ్లారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం విరాట్ నగర్ లో పట్టపగలే దోపిడీ జరిగింది. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు, దంపతులను కత్తులతో బెదిరించి 39 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.