: అత్యాచార యత్నం చేశాడని కొట్టి చంపేశారు!
ఓ యువతిపై అత్యాచార యత్నం చేశాడని, ఆమె బంధువులు ఆగ్రహంతో నిందితుడిని కొట్టి చంపేశారు. ఈ దారుణం గుంటూరు జిల్లాలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జరిగింది. పొలానికి వెళ్లిన యువతిపై గంగయ్య అనే యువకుడు కన్నేశాడు. అత్యాచార యత్నానికి పాల్పడగా, ఆ యువతి అతడి నుంచి తప్పించుకుని జరిగిన విషయాన్ని బంధువులకు వివరించింది. దీంతో ఆగ్రహంతో ఆ యువతి బంధువులు నిందితుడిపై దాడి చేశారు. గంగయ్యను దారుణంగా కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.