: 'వాల్' తో విభేదించిన అక్రమ్
జహీర్ ఖాన్ ఇక తప్పుకుంటే మంచిదన్న రాహుల్ ద్రావిడ్ అభిప్రాయం తప్పంటున్నాడు పాకిస్తాన్ పేస్ దిగ్గజం వసీం అక్రమ్. జహీర్ లాంటి అనుభవజ్ఞుడు జట్టులో ఉండడం యువ బౌలర్లకు లాభిస్తుందని అక్రమ్ పేర్కొన్నాడు. మైదానంలో జహీర్ లాంటి ఆటగాళ్ళున్నప్పుడు ఇతర బౌలర్లు రివర్స్ స్వింగ్, ఇతర మెళకువలు తెలుసుకోవడం చాలా సులువవుతుందని చెప్పాడు. వికెట్లు పడగొట్టడం కన్నా ఒకరిద్దరు ఫాస్ట్ బౌలర్లను మెరికల్లా తీర్చిదిద్దడంలో జహీర్ పాత్ర కీలకమవుతుందని ఈ స్వింగ్ సుల్తాన్ పేర్కొన్నాడు.