: ఏయూకి ఐఎస్ వో గుర్తింపు
ఆంధ్రా విశ్వవిద్యాలయానికి అరుదైన పురస్కారం దక్కింది. ఏయూకి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఎస్ వో 9001-2008 గుర్తింపు లభించింది. కాగా, రాష్ట్రంలో ఈ గుర్తింపు పొందిన తొలి యూనివర్శిటీ ఇదేనని ఏయూ వైస్ చాన్సలర్ ఆచార్య జీఎన్ఎన్ రాజు తెలిపారు. ఇదేగాకుండా ఏయూకి మరో విశిష్ట గుర్తింపు కూడా లభించింది. 'కెరీర్ 360 డిగ్రీస్' మ్యాగ్ జైన్ దేశవ్యాప్త సర్వే అనంతరం ఎంపిక చేసిన పది ఉత్తమ యూనివర్శిటీల్లో ఏయూ కూడా స్థానం దక్కించుకోవడం విశేషం.