: కాంగ్రెస్ ను చిత్తుగా ఓడిద్దాం.. దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళదాం: చంద్రబాబు
టీఆర్ఎస్, వైకాపాల మద్దతుతో ఇరు ప్రాంతాల్లో టీడీపీని గల్లంతు చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఒక శని అని, దాన్ని తరిమికొట్టిన ఘనత ఎన్టీఆర్ దే అని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను మరోసారి చిత్తుగా ఓడించి, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. 1994లో జీతాలివ్వలేని పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని ఆర్థికంగా దూసుకెళ్లేలా చేశామని ఆయన చెప్పారు. ఈ రోజు టీటీడీపీ నేతలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒక వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తోందని... సీమాంధ్ర, తెలంగాణలో గెలవబోయేది టీడీపీయే అని చెప్పారు. పంచాయతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించిందని... తెలంగాణలో కూడా రెండు జిల్లాలలో జెండా ఎగురవేశామని చెప్పారు. హైదరాబాదు శాంతిభద్రతలను గవర్నర్ కు అప్పగించడం రాజ్యాంగ విరుద్ధమే అని అన్నారు.