: శ్రీనివాస మంగాపురంలో కన్నుల పండువగా సాగిన కల్పవృక్ష వాహన సేవ


తిరుపతి సమీపంలో ఉన్న శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వేంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు (శనివారం) కల్పవృక్ష వాహనంలో ఆసీనులైన కళ్యాణ వేంకటేశ్వరుడు తిరువీధుల్లో విహరించారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవృక్షంపై ఉన్న శ్రీవారిని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. భక్తులతో శ్రీనివాసమంగాపురం వీధులు కిటకిటలాడాయి. వాహనానికి ముందు భజన బృందాలు, భక్తుల కోలాటాలు వీక్షకులను విశేషంగా అలరించాయి.

  • Loading...

More Telugu News