: ఓరల్ బీ స్మార్ట్ టూత్ బ్రష్ వచ్చేస్తోంది
త్వరలో రానున్న ఓరల్ బీ స్మార్ట్ టూత్ బ్రష్ మీ చేతిలో ఉంటే బ్రష్ చేసుకోవడం ఎంతో సులభం. బ్లూటూత్ ద్వారా స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ తో ఇది అనుసంధానమై ఉంటుంది. ఈ అప్లికేషన్ ను దంతవైద్యుల సాయంతో ప్రోక్టర్ అండ్ గేంబుల్ రూపొందించింది. కనుక మీరు బ్రష్ చేస్తున్నప్పుడే నోటిలోపల ఏ భాగంలో అయినా శుభ్రంగా చేసుకోకపోయినా, లేక ఒక వైపు సరిగా చేసుకుని, మరొక వైపు వదిలేసినా ఈ అప్లికేషన్ హెచ్చరిస్తుంది. ఈ టూత్ బ్రష్ ను వచ్చే వారంలో బార్సెలోనాలో జరిగే ప్రపంచ మొబైల్ సదస్సులో ఆవిష్కరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. వచ్చే జూన్ నుంచి ఈ బ్రష్ లను విక్రయించాలని ప్రోక్టర్ అండ్ గేంబుల్ యోచిస్తోంది.