: చంద్రబాబు నిర్ణయాలను శిరసావహిద్దాం: ఎర్రబెల్లి


రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకే వదిలేద్దామని... ఆయన నిర్ణయాన్ని శిరసావహిద్దామని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు తన సహచరులకు సూచించారు. జగన్ మాదిరిగా తెలంగాణలో చేతులెత్తేసి, సీమాంధ్రలో పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు అనుకోలేదని చెప్పారు. ఇరు ప్రాంతాలకు సమ న్యాయం జరగాలనే కోరుకున్నారని తెలిపారు. తెలంగాణ రావాలని టీఆర్ఎస్ మనస్పూర్తిగా కోరుకోలేదని ఆరోపించారు. టీటీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. టీడీపీలో పదవులు అనుభవించి వ్యక్తిగత స్వార్థం కోసం కొంత మంది పార్టీని వీడారని... అలాంటి వారి గురించి పట్టించుకోనక్కర్లేదని చెప్పారు. రానున్న ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేయడానికి తెదేపా శ్రేణులన్నీ కష్టపడాలని పిలుపునిచ్చారు. ఇకపై టీడీపీ జాతీయ పార్టీగా ఉంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News