: టీటీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం ప్రారంభం.. హాజరైన మోత్కుపల్లి
తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలతో చంద్రబాబు విస్తృత స్థాయి సమావేశం ఎన్టీఆర్ భవన్ లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా హాజరయ్యారు. గత రాజ్యసభ ఎన్నికల్లో సీటు కేటాయించకపోవడంతో మోత్కుపల్లి అలక వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రాంత నేతలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు.