: సోనియాతో ముగిసిన కన్నా, ఉత్తమ్ కుమార్ ల భేటీ
రాష్ట్రంలో కొత్త సీఎంను నియమించాలా? లేక, రాష్ట్రపతి పాలన విధించాలా? అనే కోణంలో... కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, ఉత్తమ్ కుమార్ రెడ్డిల సమావేశం ముగిసింది. వీరి భేటీ అరగంటకు పైగా జరిగింది. సీఎం పదవిని దళితులకు, పీసీసీ చీఫ్ పదవిని బీసీలకు ఇవ్వాలని ఈ సందర్భంగా ఉత్తమ్ సూచించారు. కాపులను బీసీల్లో చేర్చాలని సోనియాను కన్నా కోరారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై వారు చర్చించారు. నిన్న గీతారెడ్డి, డీఎస్ లు సోనియాతో భేటీ అయిన సంగతి తెలిసిందే.