: పెప్పర్ స్ప్రే చల్లిన లగడపాటిపై పోలీసులకు పొన్నం ఫిర్యాదు
రాష్ట్ర విభజన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టే సందర్భంలో పెప్పర్ స్ప్రే చల్లిన లగడపాటి రాజగోపాల్ పై క్రిమినల్ కేసు పెట్టాలని కోరుతూ కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరును కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఘటన పార్లమెంటు లోపల జరిగినందున న్యాయ సలహా అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.