: షారుక్ ఖాన్ భావోద్వేగం!


నటన, డాన్స్, పాటలతో ఎప్పుడూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే నటుడు షారుక్ ఖాన్ ఇటీవల ఓ కార్యక్రమంలో భావోద్వేగానికి లోనయ్యాడు. దాదాపు ఏడ్చినంత పని చేశాడు. ఐపీఎల్ లోని 'కోల్ కత నైట్ రైడర్స్' (కెకెఆర్) జట్టుకు షారుక్ ఓ భాగస్వామి అన్న సంగతి అందరికీ తెలిసిందే. దానిపై తయారుచేసిన ఓ డాక్యుమెంటరీ ఫుటేజ్ ను కొన్ని రోజుల కిందట ప్రదర్శించారు. అది చూసిన అనంతరం షారుక్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడిన ఖాన్, డాక్యుమెంటరీ చాలా బాగుందని, అది చూస్తున్నప్పుడు తన కళ్ల వెంట నీళ్లు వచ్చాయని చెప్పాడు. ఇందుకు తన జట్టు కెకెఆర్ కు, దానికి సంబంధించి ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాడు. ఈ సందర్భంగా తన జట్టు 2012లో ఐపీఎల్ ట్రోఫీను దక్కించుకున్న క్షణాన్ని గుర్తు చేసుకున్నాడు. కాగా, ఆ డాక్యుమెంటరీ ఈ నెల 24 నుంచి 27 వరకు డిస్కవరీ చానెల్ లో ప్రసారం కానుంది.

  • Loading...

More Telugu News