: నేడు టి. టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ క్యాడర్ ను సిద్ధం చేసే దిశగా ఈ రోజు నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ప్రాంతాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు తెలంగాణ ప్రాంత నేతలతోను, సోమవారం సీమాంధ్ర ప్రాంత నేతలతోను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణలో పార్టీ భవితవ్యం గురించి ఈ రోజు జరిగే సమావేశంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకొంటారోనని ఆ ప్రాంత నేతలు, కార్యకర్తలు ఉత్కంఠతో ఉన్నారు.