: వీఆర్వో, వీఅర్ఏ ఫలితాల వెల్లడి నేడే!


గ్రామ రెవిన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ సహాయకుల (వీఅర్ఏ) ఉద్యోగాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను ఈ రోజు వెల్లడించనున్నారు. పరీక్ష రాసిన అభ్యర్ధులందరి మార్కులను వెల్లడించేలా భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం (సీసీఎల్ఏ) ఏర్పాట్లు చేస్తోంది. రాత పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయనే వివరాలను ఈ రోజు మధ్యాహ్నం తరువాత సీసీఎల్ఏ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. రాతపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే నియామకాలు జరగనుండడంతో అభ్యర్ధులు తీవ్రంగా పోటీపడ్డారు. ఎంపికైన అభ్యర్ధుల సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రత్యేక ఏర్పాట్లు చేయటంతోపాటు, ఎన్నికల షెడ్యూలు విడుదల అయ్యేలోపు నియామకాల ప్రక్రియను పూర్తి చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, మొత్తం 1657 వీఆర్వో పోస్టులకు గాను 11.84 లక్షల మంది అభ్యర్ధులు పోటీపడగా, 4305 వీఆర్ఏ పోస్టులకు 88,609 మంది అభ్యర్ధులు పోటీపడ్డారు. దీంతో పరీక్ష రాసిన అభ్యర్ధుల భవితవ్యం సోమవారం తేలనుంది.

  • Loading...

More Telugu News