: పాకిస్తాన్ పై భారత్ ఆగ్రహం
నిషిద్ధ టెర్రరిస్టు నేత మౌలానా మసూద్ అజహర్ విషయంలో భారత్ .. పాకిస్తాన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా నిషేధం ఎదుర్కొంటున్న మసూద్ అజహర్ ను భారత వ్యతిరేక సభల్లో పాల్గొనేందుకు ఎలా అనుమతిస్తారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రశ్నించారు. జనవరి 26న పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ, భారత్ పై దాడికి వందల సంఖ్యలో ఫిదాయీలు (ఆత్మాహుతి దళ సభ్యులు) సిద్ధంగా ఉన్నారని అజహర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా పరిగణించింది. అతను భారత్ పై విషం చిమ్ముతున్నాడని ఆరోపించింది. కాగా, భారత్ స్పందనపై పాక్ విదేశాంగ శాఖ ప్రతిస్పందిస్తూ.. ఆ సభ ఎప్పుడో ఒకసారి జరుగుతుందని, దానిపై భారత్ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని సూచించింది.