: విభజనను వ్యతిరేకించడం లేదు... విభజన తీరును వ్యతిరేకిస్తున్నాం: చంద్రబాబు


తాను విభజనను వ్యతిరేకించడం లేదని, విభజన చేసిన తీరును వ్యతిరేకిస్తున్నానని ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పేర్కొన్నారు. విభజన విషయంలో అన్ని పార్టీలు గందరగోళంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఉందని ఆయన వివరించారు. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లోనూ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. సీమాంధ్రలో లబ్ధి పొందేందుకు సొంత పార్టీనే పణంగా పెట్టి వైఎస్సార్సీపీని ప్రోత్సహించిందని విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ రోజో, రేపో విలీనమవుతాయన్నారు. ప్రత్యేక ప్రతిపత్తి హామీ కంటితుడుపు చర్య మాత్రమేనని అన్నారు.

  • Loading...

More Telugu News