: సీమాంధ్రకు 'ప్రత్యేక' హోదా ఇచ్చినపుడు మాకెందుకివ్వరు?: బీహార్ సీఎం


బీహార్ సీఎం నితీశ్ కుమార్ కేంద్రంపై మండిపడ్డారు. సీమాంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్నపుడు బీహార్ కు ఎందుకివ్వరని ప్రశ్నించారు. బీహార్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని ఆయన చెప్పారు. సీమాంధ్రకు ఎలాంటి హోదా కల్పించినా తాము పట్టించుకోబోమని, కానీ, దీర్ఘకాలంగా బీహార్ ప్రత్యేక ప్రతిపత్తి విషయమై నిరీక్షిస్తోందని చెప్పారు. కేంద్రం ద్రోహపూరిత వైఖరికి నిరసనగా ఈ మేరకు బీహార్లో మార్చి1న అన్ని రాజకీయ పార్టీలు బంద్ లో పాల్గొనాలని నితీశ్ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News